Train Accident : రష్యాలో ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన ప్యాసింజర్ ట్రైన్

Train Accident : రష్యాలోని ఉత్తర ప్రాంతంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. కోమి రిపబ్లిక్‌లోని ఇంటా అనే చిన్న పట్టణానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. రైలులో 215 మంది ప్రయాణికులు ఉన్నారని కోమి రిపబ్లిక్ అధిపతి వ్లాదిమిర్ ఉయ్బా తెలిపారు.70 మంది గాయపడ్డారని, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

Update: 2024-06-27 00:44 GMT

Train Accident : రష్యాలో ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన ప్యాసింజర్ ట్రైన్

Train Accident : రష్యాలోని ఉత్తర ప్రాంతంలో ప్యాసింజర్ రైలు తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మంది గాయపడ్డారు. కోమి రిపబ్లిక్‌లోని ఇంటా అనే చిన్న పట్టణానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. రైలులో 215 మంది ప్రయాణికులు ఉన్నారని కోమి రిపబ్లిక్ అధిపతి వ్లాదిమిర్ ఉయ్బా తెలిపారు.70 మంది గాయపడ్డారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు. రైలు చివరి ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయని, అయితే ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెంటనే వెల్లడించలేదని ఆయన అన్నారు.

రష్యన్ స్టేట్ మీడియా ప్రచురించిన పలు చిత్రాలను చూస్తే.. అడవి అంచున ఉన్న గుంటలో అనేక బోగీలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.ప్రపంచంలోని అతిపెద్ద దేశం విస్తారమైన రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న రష్యాలో రైలు ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతుంటాయి. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్దం కారణంగా రష్యాలోని చాలా వరకు రైల్వేలు విధ్వంసకర ఘటనలను ఎదుర్కుంటుంది. ఇప్పుడు రైల్వే వ్యవస్థను ఎక్కువగా సైనికులు ఉక్రెయిన్‌లోకి పరికరాలను రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు.

కాగా రైలు ప్రమాదం ఘటన గురించి సమాచారం అందగానే రెస్య్కూటీంను ఘటనాస్థలానికి పంపించారు. క్షతగాత్రులకు సహాయం చేస్తున్నట్లు రష్యన్ రైల్వే టెలిగ్రామ్‌లో తెలిపింది. 




Tags:    

Similar News