యురేకా తీరంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.8 గా నమోదు

Update: 2020-03-09 04:58 GMT

కాలిఫోర్నియాలోని యురేకా తీరంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. యురేకాకు నైరుతి దిశలో 70 మైళ్ళ దూరంలో పసిఫిక్ మహాసముద్రం క్రింద ఒక మైలు లోతులో భూకంప కేంద్రం ఉందని సర్వే ఏజెన్సీ నివేదించింది. ముందుగా తీవ్రత 5.9 గా నివేదించింది, కాని రాత్రికి అది 5.8 కు తగ్గిందని వెల్లడించింది. భూకంపం తీరానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రజలు దీనిని గమనించారు.

అయితే సునామీ ముప్పు లేదని యుఎస్‌ జిఎస్ జియోఫిజిస్ట్ జెస్సికా టర్నర్ అన్నారు. అలాగే యురేకాకు దక్షిణాన 45 మైళ్ళ దూరంలో ఉన్న పెట్రోలియా అనే పట్టణానికి పశ్చిమాన ఉన్న టెంబ్లర్ కు కూడా సునామీ ప్రమాదం లేదని చెప్పారు. భూకంపం కారణంగా ఎవరూ గాయపడలేదని.. నష్టం కూడా లేదని నివేదికలు వెల్లడించాయి. కాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో సీలింగ్ లైట్ వణుకుతున్నట్లు చూపిస్తుంది. దీంతో దాని తీవ్రత భారీగానే ఉన్నట్టు అర్ధమవుతోంది.  



Tags:    

Similar News