Joe Biden:జోబైడెన్ సంచలన ప్రకటన..వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారీస్‎కు సపోర్ట్

Joe Biden:అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్ష పదవికి పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రెసిడెంట్ గా తన మద్దతును కూడా జోబైడెన్ తెలియజేశారు.

Update: 2024-07-22 02:57 GMT

Joe Biden:జోబైడెన్ సంచలన ప్రకటన..వచ్చే ఎన్నికల్లో అమెరిక అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారీస్‎కు సోపర్ట్

Joe Biden:అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024.. ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి.ఊహాగానాల మధ్య, గత రాత్రి అమెరికా అధ్యక్షుడు, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడమే కాదు తన నిర్ణయం తన రాజకీయ పార్టీకి,దేశానికి మేలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు అధ్యక్ష పదవికి డెమోక్రాట్ వైపు నుంచి ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అభ్యర్థిత్వానికి బైడెన్ మద్దతు కూడా ఇచ్చారు.

నవంబర్ 5న అమెరికాలో జరగనున్న ఓటింగ్ కు నాలుగు నెలల ముందే 81 ఏండ్ల జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ చివరిలో తన రిపబ్లిక్ ప్రత్యర్థి, దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చలో అతని పేలవమైన ప్రదర్శన తర్వాత డెమోక్రాటిక్ పార్టీ నాయకులు గత కొన్ని వారాలుగా పోటీ నుంచి వైదొలగాలని బైడెన్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2025లో జోబైడెన్ అధ్యక్ష పదవీకాలం ముగుస్తుంది. అప్పటి వరకు అమెరికా ప్రెసిడెంట్, కమాండర్ ఇన్ చీఫ్ గా కొనసాగుతానని బైడెన్ ట్విట్టర్ పోస్టు ద్వారా వెల్లడించారు. ఈ వారంలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

జో బిడెన్ ఏం చెప్పారు?

మీ అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో గొప్ప గౌరవం అని జో బిడెన్ లేఖ విడుదల చేశారు. నా పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా నేను తప్పుకుని, నా మిగిలిన పదవీకాలం వరకు అధ్యక్షుడిగా నా బాధ్యతలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తానని నేను నమ్ముతున్నాను. ఈ వారంలో నా నిర్ణయం గురించి మరింత వివరంగా దేశంతో మాట్లాడతాను.

కమలా హారిస్‌కు మద్దతు పలికారు:

2020లో పార్టీ అభ్యర్థిగా నా మొదటి నిర్ణయం కమలా హారిస్‌ని ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం...ఇది నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. ఈ సంవత్సరం కమలని మా పార్టీ అభ్యర్థిగా చేసినందుకు ఈ రోజు నేను ఆమెకు నా పూర్తి మద్దతు అందించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం వచ్చింది అంటూ లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News