Israeli Gaza War: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు..34 మంది మృతి

Israeli Gaza War: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. తాజాగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-09-12 04:38 GMT

Israeli Gaza War: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు..34 మంది మృతి

Israeli Gaza War : గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పునరావాస కేంద్రంగా ఉన్న పాఠశాల భవనం, ఇళ్లపై జరిపిన దాడిలో 34 మంది మరణించారు. అందులో 19 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా తెలిపింది. అటు వెస్ట్ బ్యాంక్ లోనూ నిర్వహించిన దాడుల్లో 5 మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

బుధవారం ఉదయం సెంట్రల్ గాజాలోని నుసీరత్ శరణార్థి శిబిరం సమీపంలోని అల్ జౌనీ ప్రిపరేటరీ బాయ్స్ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 14 మంది మరణించారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే పాఠశాల నుంచి హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని..అందుకే దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు వెస్ట్ బ్యాంకులోని ట్యూబస్ నగరంలో మిలిటెంట్లు లక్ష్యంగా నిర్వహించిన వైమానిక దాడిలో ఐదుగురిని హతమార్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది.

కాగా గత ఏడాది అక్టోబర్ లో ఇజ్రాయెల్ పై హమాస్ జరిగిన దాడికి ప్రతిస్పందనగా గాజా నగరాలపై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతుంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో పెద్దెత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 80వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వీటిని నిర్మించేందుకు బిలియన్ డాలర్లు అవసరమని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన బీకర దాడిలో 12వందల మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ జరిపిన ప్రతికార దాడిలో ఇప్పటి వరకు 41వేలకు పైగా పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయారు. 95వేల మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరో పది వేల డెడ్ బాడీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా గాజాలో 80వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

4కోట్ల టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. వీటిని తొలగించేందుకు 15ఏండ్లు పడుతుందని 50-60కోట్ల డాలర్ల ఖర్చు అవుతుందని లెక్కలేసింది. ఇక ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం దాదాపు 19లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. గాజా పునర్మిర్మాణానికి 2040 సంవత్సరం వరకు లేదా మరిన్ని దశాబ్దాల సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News