Plane Crash: కజకిస్తాన్‌ విమాన ప్రమాదం.. రష్యా కీలక ప్రకటన..

Plane Crash: కజకిస్థాన్‌లో విమానం కుప్పకూలడానికి రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థే కారణమని.. అజర్ బైజన్ మీడియాలో కథనాలు ప్రచురితమవ్వడంపై రష్యా స్పందించింది.

Update: 2024-12-27 06:24 GMT

Plane Crash: కజకిస్తాన్‌ విమాన ప్రమాదం.. రష్యా కీలక ప్రకటన..

Plane Crash: కజకిస్థాన్‌లో విమానం కుప్పకూలడానికి రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థే కారణమని.. అజర్ బైజన్ మీడియాలో కథనాలు ప్రచురితమవ్వడంపై రష్యా స్పందించింది. విమాన ప్రమాదానికి తామే కారణమని జరుగుతున్న ఊహాజనిత ప్రచారాన్ని రష్యా ఖండించింది.

ఈ ప్రమాదంపై ఊహాగానాలు ఆపాలని కోరింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని.. విచారణ పూర్తయ్యే దాకా ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రచారం చేయడం సరికాదన్నారు.

అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం కుప్పకూలడంతో 38 మంది మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో విమాన ప్రమాదంలో కుట్ర కోణం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అజర్ బైజన్‌లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా.. కజకిస్థాన్‌లోని ఆక్టావ్‌లో ఈ విమానం కూలిపోయింది.

పక్షి ఢీ కొట్టడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ట్రై చేస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ వెల్లడించింది. కానీ ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్ కూలిన సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య దాడులు జరగడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. దానిని కీవ్‌కు చెందిన డ్రోన్‌గా భావించడం వల్లే రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న తరుణంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు పేర్కొన్నాయి. కొన్ని చిత్రాల్లో విమానం బాడీపై బుల్లెట్లు ఉన్న ఆనవాళ్లు కనిపించినట్టు తెలిపాయి.

Tags:    

Similar News