గృహనిర్బంధంలో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌.. సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్న న్యూస్..

Xi Jinping: చైనాలో చోటుచేసుకున్న పరిణామాలు సంచలనం రేపుతున్నాయి.

Update: 2022-09-25 04:12 GMT

గృహనిర్బంధంలో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌.. సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్న న్యూస్..

Xi Jinping: చైనాలో చోటుచేసుకున్న పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఉద్వాసనకు గురయ్యారంటూ సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది ఆయనను రాజధాని బీజింగ్‌లో గృహనిర్బంధం చేశారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. జిన్‌పింగ్‌ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గానూ తొలగించారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి విమానాల రద్దు కావడం బీజింగ్‌లో భారీ సైనిక బందోబస్తు వీటికి మరింత ఆజ్యం పోశాయి.

ఉజ్బెకిస్థాన్‌లో షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో పాల్గొని స్వదేశానికి ఈనెల 16న తిరిగొచ్చిన జిన్‌పింగ్‌ను విమానాశ్రయంలోనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అదుపులోకి తీసుకుందని తర్వాత గృహనిర్బంధం చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఉటంకిస్తూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌ చేయడం మరింత బలం చేకూరింది. అయితే వీటిని చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ ధ్రువీకరించలేదు.

షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సుకు వెళ్లిన సందర్భంలో జిన్‌పింగ్‌ను ఆర్మీ చీఫ్‌ పదవి నుంచి తొలగించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం నిర్ణయించింది. తర్వాత పింగ్‌ స్వదేశానికి రాగా గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. మరోవైపు విదేశాల్లో ఉంటున్న పలువురు చైనా జాతీయులు కూడా జిన్‌పింగ్‌ గృహనిర్బంధంలో ఉన్నారంటూ ట్వీట్లు చేశారు. ప్రభుత్వాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా నియంత్రణలోకి తీసుకుందంటూ పేర్కొన్నారు. మరికొందరైతే జిన్‌పింగ్‌ స్థానంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్‌గా ఉన్న లీ కుమింగ్‌ను చైనా అధ్యక్షుడిగా నియమించారంటూ కూడా పోస్టులు పెట్టారు. మొత్తానికి ఈ వ్యవహారంపై వేలాదిగా ట్వీట్లు వెల్లువెత్తాయి.

Tags:    

Similar News