కరోనాపై హాంకాంగ్ ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు

-ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మందికి కరోనా వైరస్ - వెయ్యి దాటిన కరోనా మృతుల సంఖ్య

Update: 2020-02-11 17:10 GMT
కరోనాపై హాంకాంగ్ ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్ ఇలానే విజృంభిస్తూ వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ ను అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడమే కారణం అవుతుందంటూ.. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మెడికల్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ గాబ్రియల్‌ లియంగ్‌ విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 43 వేల మంది కరోనా బారిన పడగా, ఒక్క చైనాలోనే 42 వేల మంది బాధితులున్నారని తెలిపారు.

ఈ వైరస్‌తో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య వెయ్యికి దాటింది. కరోనాబైరస్‌ సోకిన ప్రతి రోగి ద్వారా.. రెండున్నర శాతం మందికి సోకుతోందని, ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80 శాతం మంది ఈ వైరస్‌ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ఆయన తన రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

 

Tags:    

Similar News