US Shooting: అమెరికాలో కాల్పులు..ఐదుగురు మృతి

US Shooting: అమెరికాలో వరుస కాల్పులు కలకలం రేపుతున్నాయి. తాజాగా జరిగిన కాల్పుల్లో ఐదుగురు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. లాస్ వెగాస్ లో విచక్షణారహితంగా కాల్పులుకు తెగబడ్డ దుండగుడు..కాల్పుల అనంతరం తనను తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.

Update: 2024-06-26 03:31 GMT

US Shooting: అమెరికాలో కాల్పులు..ఐదుగురు మృతి

US Shooting: అమెరికాలో కాల్పులు ఆగడం లేదు. నిత్యం ఏదొక ప్రాంతంలో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో సామాన్య ప్రజలు ఎందురో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా లాస్ వెగాస్ సమీపంలో ఉన్న అపార్ట్ మెంట్లో సోమవారం అర్థరాత్రి కాల్పులు జరిగాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

మరింత లోపలికి వెళ్లి చూసిన పోలీసులకు 13ఏండ్ల బాలిక తుపాకీ గాయాలతో కొట్టుమిట్టాడటం గమనించారు. వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. సమీపంలోని మరో అపార్ట్ మెంట్లో ఇద్దరు మహిళలు, ఓ యువకుడి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. దుండగుడి కాల్పుల్లో మొత్తం ఐదుగురు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.

కాల్పులకు తెగబడిన నిందితుడు సమీపంలో ఉన్నట్లు స్థానికులను పోలీసులు అలర్ట్ చేశారు. అతని కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఓ దుకాణం దగ్గరలో నిందితుడు కనిపించాడని పోలీసులు సమాచారం అందడంతో అక్కడికి పోలీసులు చేరుకోవడంతో..దుండగుడు పరుగెత్తాడు. తుపాకీ విడిచిపెట్టి లొంగిపోవాలని పోలీసులు కోరినప్పటికీ..అతను నిరాకరించాడు. చివరికి తనను తానే కాల్పుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే కాల్పులకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదు.

Tags:    

Similar News