పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లను కుదిపేసిన భూకంపం

* 11మంది మృతి, 170 మందికి గాయాలు

Update: 2023-03-22 06:44 GMT

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లను కుదిపేసిన భూకంపం

Earth Quake: మన దేశంలోని ఉత్తారాది రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.6గా నమోదైంది. రాత్రి 10 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనాలు దెబ్బతిన్నాయి, కొండచరియలు విరిగిపడ్డాయి. జనం తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాక్‌లో భూకంపం దాటికి ఇద్దరు మహిళలు సహా ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 160 మందికిపైగా గాయపడ్డారు. అఫ్గనిస్తాన్‌ ఈశాన్య లాగ్మాన్ ప్రావిన్స్‌లో ఇద్దరు మరణించగా ఎనిమిదిమంది గాయపడ్డారు.

Tags:    

Similar News