13 గంటలు ప్రయాణించి వెనక్కి మళ్లిన విమానం.. ఎక్కడి నుంచి బయలుదేరిందో మళ్లీ అక్కడికే..

Emirates Flight: ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యింది.

Update: 2023-01-31 13:45 GMT

13 గంటలు ప్రయాణించి వెనక్కి మళ్లిన విమానం.. ఎక్కడి నుంచి బయలుదేరిందో మళ్లీ అక్కడికే..

Emirates Flight: ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. సుమారు 5వేల కిలోమీటర్ల మేర ప్రయాణించింది.. అయితే ఉన్నట్టుండి విమానం రివర్స్ తీసుకుంది.. చివరికి ఎక్కడ నుంచి బయలుదేరిందో అక్కడికే చేరుకుంది.. ఈ విషయం విమానంలో ఉన్న ప్రయాణికులకు తెలియదు.. తీరా.. విమానం టేకాఫ్ అయిన తరువాత.. ప్రయాణికులు కిందికి దిగి.. అవాక్కయ్యారు. అదేంటి.. ఇన్ని గంటలు ప్రయాణించినా.. మళ్లీ బయలుదేరిన విమానాశ్రయానికే చేరుకున్నామని.. సిబ్బందిని నిలదీశారు. తీరా విషయం తెలుసుకుని.. సైలెంట్ గా వెళ్లిపోయారు.

నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ అసాధారణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి న్యూజీలాండ్ లోని అక్లాండ్ కు ఉదయం పదిన్నర గంటలకు ఎమిరేట్స్ కు చెందిన విమానం.. ఈకే-448 టేకాఫ్ అయింది. సుమారు 13 గంటలు ప్రయాణించింది.. అయితే అక్లాండ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరి.. ఎయిర్ పోర్టు మునిగిపోయింది. దీంతో విమాన రాకపోకలను నిలిపేశారు. విషయం తెలుసుకున్న పైలట్లు విమానాన్ని ప్రయాణం మధ్యలోనే వెనక్కి తిప్పారు. అయితే.. అక్లాండ్ ఎయిర్ పోర్ట్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని ఒక ప్రకటన విడుదల చేసింది.

Tags:    

Similar News