అమెరికాను కరోనా షేక్ చేస్తోంది. వైరస్ మరింత విజృంభిస్తుంది.కరోనా కాటుకు అగ్రరాజ్యం అల్లాడుతోంది. అమెరికాలో ప్రతీ రెండున్నర నిమిషాలకు ఓ మరణం సంభవిస్తోంది. న్యూయార్క్‌లో పరిస్థితి చేయిదాటింది. ఇప్పటివరకు ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది చనిపోయారు. అమెరికా వ్యాప్తంగా 10 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్క రోజులోనే 594 మంది మృతి చెందారు.
అమెరికాలో కరోనా పంజా విసిరింది. వైరస్ బాధితుల సంఖ్య మూడున్నర లక్షలు దాటింది. ఇందులో మూడు లక్షల 36 వేలు కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. దాదాపు 20 వేల మంది రికవరీ అయ్యారు. మృతుల సంఖ్య 11 వేలకు చేరువలో ఉంది. కరోనా కంట్రోల్ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. గంటగంటకు వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.