అమెరికాలో పిట్టల్లా రాలిపోతున్న పౌరులు.. మరణాల సంఖ్య చూస్తే..

అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వైరస్‌ బారిన పడి ఆ దేశ పౌరులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే, అమెరికాలో మరణించిన వారి సంఖ్య ఇతర దేశాలను మించిపోయింది.

Update: 2020-04-16 02:53 GMT

అమెరికా లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వైరస్‌ బారిన పడి ఆ దేశ పౌరులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే, అమెరికాలో మరణించిన వారి సంఖ్య ఇతర దేశాలను మించిపోయింది.మొత్తం యుఎస్ మరణాల సంఖ్య 28,529 కు చేరుకుంది. ఇందులో 10 వేలకుపైగా మరణాలు ఒక్క న్యూయార్క్‌లోనే నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే అక్కడ 2,129 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇందులో న్యూయార్క్‌ నగరంలోనే అత్యధికంగా ఉన్నాయి.

అంతేకాదు దేశంలోని మిగిలిన ప్రాంతాలలో, న్యూజెర్సీ, మిచిగాన్, లూసియానా మరియు మసాచుసెట్స్లలో ఎక్కువ మంది మరణించారు. ఇక వైరస్ కేసుల పరంగా చూస్తే మొత్తం 644,089 కేసులు ఉంటే.. ఇందులో 28,529 మంది మరణించారు. ఇక వివిధ రాష్ట్రాల్లో మొత్తం 48,701 మంది కోలుకున్నారు.

మరోవైపు కరోనా సంక్షోభం కారణంగా ఇప్పటివరకు రూ.38 వేల కోట్ల నుంచి రూ.76 వేల కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయం పడిపోయిందని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డి బ్లాసియో అంచనా వేశారు. అయితే రోజురోజుకు ఆర్ధిక వ్యవస్థ వివిధ రాష్ట్రాల్లో పతనం అవుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లకే వదిలేశారు. అయితే మొత్తం 50 రాష్ట్రాలకుగాను 20 రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయన్న ట్రంప్.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

Tags:    

Similar News