California Wildfire: కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు..3.5లక్షల ఎకరాలు అగ్గిపాలు
California Wildfire: కాలిఫోర్నియాలో వందలాది ఎకరాల్లో అడవి అగ్గిపాలయ్యింది. ఒక్క వ్యక్తి కారణంగా కార్చిచ్చు 5వేల ఎకరాలను కాల్చేస్తోంది. వేలాది మంది ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నా మంటలు అదుపులోకి రావడం లేదు.
California Wildfire: ఉత్తరకాలిఫోర్నియాలో ఒక వ్యక్తి చేసిన తప్పువల్ల పుట్టుకొచ్చిన కార్చిచ్చు ది పార్క్ ఫైర్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అడవిని కాల్చిబూడిద చేస్తోంది. కావాలనే అడవికి నిప్పు పెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. ఓ వ్యక్తి కాలిపోతున్న కారును దొర్లించడంతో మంటలు మొదలైనట్లు అక్కడి పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన 42 ఏళ్ల అనుమాతుడిని పోలీసులు అరెస్టు చేశారు.
కాగా ఇప్పటి వరకు ఈశాన్య చికోలో ఈ కార్చిచ్చు వల్ల 3,48000 ఎకరాలు దహనమైంది. కాలిఫోర్నియాలోని బుట్టె, టెహమ్మా కౌంటీల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు గవర్నర్ గవిన్ న్యూసర్ తెలిపారు. 2018లో ఈ ప్రాంతాల్లో వ్యాంపించిన మంటల్లో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2,500 మంది ఫైర్ సిబ్బంది ఈ మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. 16 హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు. ముఖ్యంగా ఎత్తైన కొండలు, గాలుల కారణంగా ఈ మంటలను ఆర్పడం కష్టంగా మారుతోంది. కొన్ని చోట్ల సుడులు ఏర్పడతంతో మరింత ఆటంకం కలుగుతోంది.
కాగా ఈ ఏడాది కాలిఫోర్నియా ఎదుర్కొంటున్న అతిపెద్ద కార్చిచ్చు ఇదేనని కాల్ ఫైర్ సంస్థ కమాండర్ బిల్లీ సి తెలిపారు. ఈ మంటలు గంటకు 5వేల ఎకరాలకు వ్యాపిస్తున్నాయని చెప్పారు. శనివారం ఫైర్ సిబ్బంది సంఖ్యను మూడు రెట్లు పెంచినట్లు పేర్కొన్నారు. అయినా కూడా సిబ్బంది సరిపోవడం లేదన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో భారీగా గడ్డి పెరగడంతో ఫైర్ సిబ్బంది ముందుకు వెళ్లలేకపోతున్నారు. నిన్న ఒక్కరోజే 1.5లక్షల ఎకరాలు కాలిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం వందల సంఖ్యలో కార్చిచ్చులు అమెరికా, కెనడాల్లో వ్యాపించాయి. 2022వ ఏడాదిలో కూడా కార్చిచ్చు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.