వైరల్ వీడియో ‌: శునకం అదిరిపోయే స్టంట్స్ ..

జాగిలాలు చేసే విన్యాసాలు.. అవి మానవాళికి చేసే సహాయాలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇటీవల అమెరికా సైన్యంలో ఓ శునకం ఐఎస్ఐ అబు బాకర్ అల్ బాగ్దాదీ ని హతమార్చడంలో చేసిన సహాయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

Update: 2019-11-03 07:56 GMT

ఐఎస్ఐ అబు బాకర్ అల్ బాగ్దాదీని ఓ జాగిలం సాయంలో అమెరికా సైన్యం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఇరాక్‌, టర్కీ, రష్యాల దేశాల సహాకారంతో బాగ్ధాదీ జాడను అన్వేషించి అమెరికా సేనలు అతడిని చుట్టుముట్టాయి. దీంతో అబు బాకర్ అల్ బాగ్దాదీ ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ ఆపరేషన్ లో బెల్జియన్‌ మలినోయిస్‌ జాతికి చెందిన ఓ కుక్క(కే9) సాయం తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటించారు.

ఈ ఘటన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా శునకాల గురించి ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఏరడినది. జాగిలాలను మచ్చిక చేసుకోవడం.. వాటికి విన్యాసాలు నేర్పించడం.. అవి చేసే వివిధ విన్యాసాలను చూసి ఆశ్చర్యపోవడం ఎక్కువగా జరుగుఒంది. ఈ క్రమంలో బగ్దాదీని చంపిన శునకం ఇదేనంటూ పలు వీడియోలు నేట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. వాటికి ఆదరాణ కూడా అలానే ఉంటోంది. దీంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అటువంటి వీడియో ఒకటి ఇప్పుడు నేట్టింట్లో హల చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఎవరైనా ఔరా అనుకోకుండా ఉండలేరు. ఇది బాగ్దాదీని చంపినా శునకం కాకపోవచ్చు..కానీ శునకాలకు ఇచ్చే ట్రైనింగ్ లో అవి ఎలా రాటు దేలుతాయో.. విపత్కర పరిస్థితుల్లో ఎలా మానవాళికి ఉపయోగపడతాయో అర్థం అవుతుంది.



Tags:    

Similar News