ఆ దేశాలకు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్.. నో.. వీసా

కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు.

Update: 2020-04-11 06:26 GMT
Donald Trump (File Photo)
కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. శుక్రవారం కొత్త వీసా మంజూరు నిబంధనను ప్రకటించారు, ఇది COVID-19 మహమ్మారి సమయంలో

తమ పౌరులను స్వదేశానికి రప్పించడంలో ఇబ్బందులకు గురిచేసిన దేశాల పౌరులకు వీసా నిరాకరణకు వీలు కల్పిస్తుంది. వీసా ఆంక్షల కోసం ట్రంప్ మెమోరాండం జారీ చేశారు, ఇది వెంటనే అమలులోకి వచ్చి.. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమలవుతుంది.

వివిధ దేశాలు తమ పౌరులను స్వదేశానికి రప్పించడంలో ఇబ్బందులకు గురి చెయ్యడం, ఆలస్యం చేయడంతో అమెరికన్ల ప్రజా ఆరోగ్య ప్రమాదాలకు కారణమైందని అధ్యక్షుడు భావించారు. దాంతో ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. దీంతో చాలా మందికి అమెరికా వీసా నిరాకరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు వీసా నిబంధనల మార్పులకు సంబంధించి హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ, విదేశాంగ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.. దీంతో తమ పౌరులను స్వదేశానికి రప్పించాలన్న అమెరికా అభ్యర్థనను అంగీకరించని దేశాలను హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి గుర్తించే పనిలో పడ్డారు.. ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.

Tags:    

Similar News