China Floods: డ్రాగన్ కంట్రీలో వర్ష బీభత్సం
China Floods: వరుస ప్రకృతి విపత్తులు డ్రాగన్ కంట్రీలో కల్లోలం సృష్టిస్తున్నాయి.
China Floods: వరుస ప్రకృతి విపత్తులు డ్రాగన్ కంట్రీలో కల్లోలం సృష్టిస్తున్నాయి. నార్త్ చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు 15 మంది మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వరద ముంపు నేపధ్యంలో షాంక్సీ ప్రావిన్స్ నుంచి దాదాపు 1.20లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. అక్టోబర్ 2నుంచి 7వరకు రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు దాదాపు 10లక్షల మంది జీవితాలు ప్రభావితమైనట్లు అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు భారీ వరదల కారణంగా 2లక్షల 36వేల 460 హెక్టార్లలో పంటలు నాశనం కాగా 37వేల 700 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అలాగే, 6వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో చైనాకు 780 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు చైనా ప్రభుత్వం తెలిపింది.