సడెన్‌గా మోచేయి, మణికట్టులో నొప్పి పుడుతుందా..! ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..

Tendinitis: చాలామంది పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. సడెన్‌గా మోచేయి, మణికట్లు, మోకాలు, మడమలలో నొప్పి అంటూ బాధపడుతారు.

Update: 2021-12-23 06:30 GMT

సడెన్‌గా మోచేయి, మణికట్టులో నొప్పి పుడుతుందా..! ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..

Tendinitis: చాలామంది పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. సడెన్‌గా మోచేయి, మణికట్లు, మోకాలు, మడమలలో నొప్పి అంటూ బాధపడుతారు. అయితే ఇది అందరు కీళ్ల సమస్య లేదా ఆర్థ్రరైటిస్‌ అనుకుంటారు కానీ ఇది నిజం కాదు. ఇవి వేరే వ్యాధి లక్షణాలు దాని పేరు టెండినైటిస్. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అనేక సందర్భాల్లో రోగి శస్త్రచికిత్స చేయించుకోవలసి అవసరం ఉంటుంది.

వాస్తవానికి మన శరీరంలో స్నాయువులు అనేవి ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకలకు అతుక్కొని ఉండేలా చేస్తాయి. కొన్ని కారణాల వల్ల స్నాయువు ఉబ్బడం ప్రారంభించినప్పుడు ఇది టెండినిటిస్ వ్యాధికి దారితీస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ కారణంగా కూడా జరగవచ్చు. ప్రజలు తరచుగా దీనిని కాళ్ల నొప్పులుగా భావిస్తారు. సమయానికి చికిత్స తీసుకోపోతే ఈ సమస్య క్రమంగా పెరుగుతుంది. దీని కారణంగా రోగి మోకాలి, కీళ్లలో నొప్పిగా ఉంటుంది. ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ సమస్యను ఫిజియోథెరపీతో నయం చేయవచ్చు. దీని తర్వాత కూడా నొప్పి నయం కాకపోతే అప్పుడు మందులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ వ్యాధితో బాధపడుతున్న చాలా మంది రోగుల పరీక్షలో శరీరంలో విటమిన్ డి, బి-12 లోపం ఉన్నట్లు గుర్తించారు. ఇది తరచుగా 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ఈ వ్యాధి డయాబెటిక్ రోగులలో కనిపిస్తుంది. అందుకే ప్రజలు తమ ఆహారంలో శ్రద్ధ వహించడం, సూర్యరశ్మిని తగినంత మొత్తంలో తీసుకోవడం ముఖ్యం. చేతులు, కాళ్ళలో నొప్పి నిరంతరంగా ఉంటే పెయిన్ కిల్లర్స్ సహాయం తీసుకోకండి. సమయానికి వైద్యులను సంప్రదించడం మంచిది.

Tags:    

Similar News