Weight Loss: శీతాకాలంలో బరువు తగ్గడం ఎలా..? ఈ విషయాలు తెలుసుకోండి..

Weight Loss: ఆధునిక కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

Update: 2021-11-28 07:00 GMT

Weight Loss: శీతాకాలంలో బరువు తగ్గడం ఎలా..? ఈ విషయాలు తెలుసుకోండి..

Weight Loss: ఆధునిక కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రమ లేకపోవడం ప్రధాన కారణం. అలాగే సమయపాలన లేని ఆహారపు అలవాట్లు వల్ల కూడా అధికంగా బరువు పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా వల్ల అందరు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. దీనివల్ల కూడా చాలామంది బరువు, స్థూలకాయం బారిన పడుతున్నారు. అయితే బరువు తగ్గడానికి శీతాకాలం చాలా బెటర్‌. ఈ సీజన్‌లో ఈ పద్దతుల ద్వారా సులువుగా బరువు తగ్గించవచ్చు.

1. వణకడం

వణకడం వల్ల సులువుగా బరువు తగ్గించవచ్చు. అధ్యయనం ప్రకారం10 నుంచి15 నిమిషాలు వణికితే ఒక గంట వ్యాయామంతో సమానంగా కేలరీలు ఖర్చవుతాయి. ఇది మాత్రమే కాదు ఇది మీ కండరాలను కూడా తగ్గిస్తుంది.

2. సమయానికి తినడం

చలికాలం అందరు ఎక్కువగా తింటారు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలు శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి రోజువారీ కేలరీల అవసరాలను పెంచుతాయి. ఇలాంటి సమయంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం మంచిది. ఫైబర్ చాలా కాలం మీ కడుపు నిండుగా ఉంచుతుంది. ఎక్కువగా తినడాన్ని నిరోధిస్తుంది.

3. వేడి నీటిని నివారించండి

చాలా మంది ప్రజలు చల్లని కాలంలో వేడి నీటిని తాగడానికి ఇష్టపడతారు కానీ మీరు బరువు తగ్గాలంటే చల్లటి నీటిని కొనసాగించాలి. బాడీ టెంపరేచర్ కంటే చల్లగా ఉండే లిక్విడ్‌ని తాగడం వల్ల శరీరాన్ని వేడి చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది తద్వారా బరువు సులువుగా తగ్గుతారు. మీరు చల్లటి నీరు తాగలేకపోతే కనీసం సాధారణ నీటిని తాగడానికైనా ప్రయత్నించండి.

4. హెర్బల్ టీ, బ్లాక్ కాఫీ

చక్కెర, పాలతో నిండిన సాధారణ కాఫీ, టీకి బదులుగా హెర్బల్ టీ, బ్లాక్ కాఫీని తీసుకోండి. ఊలాంగ్ టీ, మందార టీ, బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. కొవ్వు వేగంగా కరుగుతుంది.

5. ఇంటి పనులు ఎక్కువగా చేయండి..

మీరు వ్యాయామం కోసం బయటకు వెళ్లకూడదనుకుంటే ఇంట్లోనే శారీరక శ్రమలో పాల్గొనండి.క్లీనింగ్, వాషింగ్, మాపింగ్, గార్డెనింగ్ వంటి ఇంటి పనులను చేయడం ద్వారా చాలా కేలరీలు బర్న్ చేయవచ్చు.

Tags:    

Similar News