Sweet Potato: కందగడ్డ ఎక్కువగా తింటే ఈ ఆరోగ్య సమస్యలు.. అవేంటంటే..?
Sweet Potato: కందగడ్డని చాలామంది ఎంతో ఇష్టంతో తింటారు. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి.
Sweet Potato: కందగడ్డని చాలామంది ఎంతో ఇష్టంతో తింటారు. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. బరువు తగ్గే వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అయితే ఒక్కోసారి దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. కొంతమందికి ఇది పడదు. ఇందులో పిండి పదార్ధాలు, కార్బోహైడ్రేట్లు, కేలరీలు అధికంగా ఉంటాయి. ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఏదైనా ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరమని గుర్తుంచుకోండి. కందగడ్డ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం.
మూత్రపిండంలో రాళ్లు ఏర్పడితే కందగడ్డని తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఉండే ఆక్సలేట్ నొప్పిని పెంచుతుంది. దీని కారణంగా పేషెంట్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కందగడ్డ మన్నిటాల్‌ను కలిగి ఉంటుంది. ఇది షుగర్ ఆల్కహాల్ లేదా పాలియోల్ అని పిలువబడే కార్బోహైడ్రేట్ రకం. ఈ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల ఎటువంటి హాని లేనప్పటికీ ఉదర సమస్యలతో బాధపడేవారికి మంచిది కాదు. దీని అధిక వినియోగం సమస్యలను కలిగిస్తుంది. విరేచనాలు, కడుపు నొప్పి, ఉబ్బరం వంటివి ఎదురవుతాయి. అందువల్ల ఉదర సమస్యలు ఉన్నవారు కందగడ్డ తినకపోవడం మంచిది.
బంగాళదుంపలతో పోలిస్తే కందగడ్డ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కంటెంట్ కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ అది ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ అధికంగా తీసుకుంటే ప్రమాదకరం. పొటాషియం అధికంగా తీసుకోవడం వల్ల హైపర్‌కలేమియా లేదా పొటాషియం టాక్సిసిటీకి దారి తీయవచ్చు ఇది గుండెపోటుకు దారి తీస్తుంది. అందుకే తక్కువ మోతాదులో తీసుకోవాలి.