TSPSC Group-4 Hall Tickets: గ్రూప్‌-4 హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

TSPSC Group-4 Hall Tickets: గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

Update: 2023-06-24 08:11 GMT

TSPSC Group-4 Hall Tickets: గ్రూప్‌-4 హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

TSPSC Group-4 Hall Tickets: గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గ్రూప్-4 పరీక్షను జులై 1వ తేదీన రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. పేపర్-1 ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది టీఎస్పీఎస్సీ.

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

Tags:    

Similar News