Telangana SI Exam: ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయండి!
Telangana SI Exam: తెలంగాణలో ఆగస్టు 7వ తేదీన జరిగే ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని..
Telangana SI Exam: తెలంగాణలో ఆగస్టు 7వ తేదీన జరిగే ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు పోలీసు నియామక మండలి అధికారులను సంప్రదించారు. అదే రోజున యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్, ఐబీపీఎస్ ఆర్ఆర్ఆ ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలు ఉన్నందుకు ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులకు స్పందించి అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎస్సై పరీక్షను వాయిదా వేయాలని కోరారు.
ఎస్సై పరీక్ష రోజు జరగనున్న ఇతర పరీక్షల తేదీలను యూపీఎస్సీ, ఐబీపీఎస్ ఇప్పటికే క్యాలండర్ ప్రకారం ప్రకటించాయి. అయితే యూపీఎస్సీ, ఐబీపీఎస్ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నందున వాటిని వాయిదా వేయడం కుదరదని అభ్యర్థులు అంటున్నారు. ఇప్పటికైనా ఎస్సై రాతపరీక్షను వాయిదా వేసి యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్షకు హాజరయ్యే అ వకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరి అభ్యర్థుల ప్రతిపాదననను అధికారులు పరిగణలోకి తీసుకొని పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తారో లేదో చూడాలి. అయితే ఇటీవల నిర్వహించిన టెట్ ఎగ్జామ్ సమయంలోనూ పరీక్షను వాయిదా వేయాలన్న డిమాండ్ పలువురు అభ్యర్థుల నుంచి వ్యక్తమైంది. అదే రోజు వేరే జాతీయ స్థాయి పరీక్షలు ఉండడమే ఇందుకు కారణం. కానీ విద్యాశాఖ మాత్రం ఆ అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే టెట్ పరీక్షను ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షను నిర్వహించింది. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందని పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు.