TS Gurukul Notification 2023: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ గురుకురాల్ల 1276 పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
TS Gurukul Notification 2023: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
TS Gurukul Notification 2023: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 24 నుంచి ఆహ్వానించింది. దరఖాస్తులకు చివరి తేదీ మే 24. రాత పరీక్ష ఆధారంగా పీజీటీ పోస్టులకు ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ గురుకులాల్లో 9231 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో 868 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 4020 టీజీటీ పోస్టులు,2008 జూనియర్ లెక్చరర్ పోస్టులు, 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్స్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్స్, 124 మ్యూజిక్ పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పోస్టులకు ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది.
రాతపరీక్షను 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ పరిజ్ఞానంపై 100 మార్కులకు ఉంటుంది. పేపర్ 3లో సబ్జెక్ట్ విషయపరిజ్ఞానంపై 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. అర్హత వయసు 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు. జనరల్ అభ్యర్థులు రూ.1200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 దరఖాస్తు రుసుం చెల్లించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అధికారిక వెబ్ సైట్ www.treirb.telangana.gov.in ద్వారా ఓటీఆర్ తో పాటు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.