TS EDCET 2023: నిరుద్యోగులకి అలర్ట్‌.. టీఎస్‌ ఎడ్‌సెట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం.. చివరితేదీ ఎప్పుడంటే..?

TS Edcet 2023: టీచర్‌ వృత్తిలో స్థిరపడాలనే విద్యార్థులు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోండి

Update: 2023-03-07 13:30 GMT

TS Edset 2023: నిరుద్యోగులకి అలర్ట్‌.. టీఎస్‌ ఎడ్‌సెట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం.. చివరితేదీ ఎప్పుడంటే..?

TS Edcet 2023: టీచర్‌ వృత్తిలో స్థిరపడాలనే విద్యార్థులు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోండి. తెలంగాణలో బీఎడ్ కోర్సులో ప్రవేశాల‌కు నిర్వహించే 'టీఎస్ ఎడ్‌సెట్ – 2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.500, ఇతరులు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించాలని గుర్తుంచుకోండి. చివరితేది ఏప్రిల్‌ 20గా నిర్ణయించారు.

అయితే రూ.250 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 30న అభ్యర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు. మే 5 నుంచి ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ ప‌రీక్ష నిర్వహించి 21న ప్రాథ‌మిక కీ విడుద‌ల చేస్తారు.తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి చివరికి ఫలితాలను ప్రకటిస్తారు. ఎడ్‌సెట్ పరీక్షకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా పీజీ కలిగి ఉండాలి. 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులు అవుతారు. అభ్యర్థుల వయోపరిమితి 01.07.2023 నాటికి 19 సంవత్సరాలు నిండాలి. అర్హతలు కలిగినవారు అన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. అయితే ఎన్‌సీసీ/స్పోర్ట్స్ కోటా/పీహెబ్/ఆర్మ్‌డ్ పర్సనల్ కోటాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం నిర్ణీత కనీస అర్హత మార్కులు సాధించాలి.

Tags:    

Similar News