గుడ్‌న్యూస్.. ఈ రాష్ట్రంలో బాలికలకి రుతుక్రమ సెలవులు..!
Menstrual Leaves: కేరళలోని ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్ బిందు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Menstrual Leaves: కేరళలోని ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్ బిందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 18 ఏళ్లు నిండిన బాలికలకు ప్రతి సంవత్సరం 60 రోజుల రుతుక్రమ సెలవులు ఉంటాయని తెలిపారు. బాలికల హాజరు 73% శాతం ఉంటే సరిపోతుందని చెప్పారు. ప్రతి యూనివర్సిటీలో రుతుక్రమ సెలవులు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇటీవల కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిని అమలు చేసింది.
జనవరి 14న కొచ్చిన్ యూనివర్శిటీ ప్రతి నెలా బాలికలకు రుతుక్రమ సెలవు ప్రకటించింది. బాలికల మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి యూనివర్సిటీలో రుతుక్రమ సెలవులు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఉన్నత విద్యాశాఖ మంత్రి బిందు తెలిపారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్‌ను అనుసరించి కొచ్చిన్ విశ్వవిద్యాలయం రుతుక్రమ సెలవులను అమలు చేస్తోంది.
రుతుక్రమ సెలవుల కింద ప్రతి సెమిస్టర్‌లో బాలికలకు 2% అదనపు హాజరు కేటాయిస్తామని విశ్వవిద్యాలయం ప్రకటించింది. సాధారణంగా 75% హాజరు ఉన్న విద్యార్థులు మాత్రమే పరీక్షలో ప్రవేశం పొందుతారు. అయితే బాలికలకి పరీక్షలో ప్రవేశానికి 73% హాజరు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. దీనికి సంబంధించి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొచ్చిన్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌కు ఒక ప్రతిపాదనను అందజేయగా విద్యాశాఖ మంత్రి అంగీకరించి అమలు చేయాలని నిర్ణయించింది.