రైల్వేలో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా.. అయితే ఇదే సువర్ణవకాశం..!

Indian Railway Jobs 2022: ఇండియన్‌ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురచూసే నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి.

Update: 2022-11-02 09:14 GMT

రైల్వేలో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా.. అయితే ఇదే సువర్ణవకాశం..!

Indian Railway Jobs 2022: ఇండియన్‌ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురచూసే నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే పలు రకాల ఉద్యోగాల భర్తీకి రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 596 స్టెనోగ్రాఫర్ , గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంటెట్ వంటి పోస్టులు ఉన్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), సెంట్రల్ రైల్వే (CR) కామన్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (GDCE) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

మొత్తం ఖాళీలు 596 ఉన్నాయి. అందులో స్టెనోగ్రాఫర్ 4, సీనియర్ కమ్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ 154, గూడ్స్ గార్డ్ 46, స్టేషన్ మాస్టర్ 75, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ 150, జూనియర్ కమ్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ 126, అకౌంట్స్ క్లర్క్ 37 ఉన్నాయి. ఈ రైల్వే ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 50 నిమిషాల ట్రాన్స్‌క్రిప్షన్ సమయంతో పాటు 10 నిమిషాల వ్యవధికి నిమిషానికి 80 పదాల షార్ట్‌హ్యాండ్ వేగం కలిగి ఉండాలి.

ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఇతర వెనుకబడిన తరగతులు 45 ఏళ్లు, రిజర్వ్‌డ్ కేటగిరీ (SC/ST) 47 ఏళ్ల వయోపరిమితి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://rrccr.com/ ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి ప్రారంభమైంది. నవంబర్‌ 28 దరఖాస్తులకు చివరితేదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News