SSC GD Constable 2022 :ఎస్సెస్సీ జీడీ కానిస్టేబుల్‌ పోస్టుల జాబితా విడుదల.. ఖాళీల వివరాలు తెలుసుకోండి..!

SSC GD Constable 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఎస్సెస్సీ జీడీ కానిస్టేబుల్‌ పోస్టుల జాబితా 2022 విడుదల చేసింది.

Update: 2023-02-12 08:30 GMT

SSC GD Constable 2022 :ఎస్సెస్సీ జీడీ కానిస్టేబుల్‌ పోస్టుల జాబితా విడుదల.. ఖాళీల వివరాలు తెలుసుకోండి..!

SSC GD Constable 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఎస్సెస్సీ జీడీ కానిస్టేబుల్‌ పోస్టుల జాబితా 2022 విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో SSF (GD), రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (GD)జాబితా ssc.nic.inలో SSC అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు ఒక్కసారి చెక్‌ చేసుకోవచ్చు.

రాష్ట్రాలు/కేటగిరీల వారీగా ఖాళీల జాబితా విడుదలైంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 46435 ఖాళీలను భర్తీ చేస్తారు. పార్ట్ I కోసం మొత్తం 46260 ఖాళీలు, పార్ట్ II కోసం 175 పోస్టులు భర్తీ అవుతాయి. అంతకుముందు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఖాళీల సంఖ్య 24369, అందులో పార్ట్ Iకి 24205, పార్ట్ IIకి 164 ఖాళీలు మాత్రమే ఉండేవి. వీటికి అదనంగా ఇప్పుడు మరికొన్ని పోస్టులని కలిపారు.

దరఖాస్తు షెడ్యూల్

ఈ పోస్టుల నమోదు ప్రక్రియ 27 అక్టోబర్ 2022న ప్రారంభమై 30 నవంబర్ 2022న ముగిసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 10 జనవరి 2023 నుంచి 14 ఫిబ్రవరి 2023 వరకు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా సూచించిన కేంద్రాలలో పరీక్ష జరుగుతోంది. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBE), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. దరఖాస్తుదారు వయస్సు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ దరఖాస్తుదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. CBT పరీక్షలో విజయవంతమైన అభ్యర్థులను PET, PST కోసం పిలుస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో జారీ చేసిన నోటీఫికేషన్‌ని తనిఖీ చేయవచ్చు.

Tags:    

Similar News