సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో సహా 20 వేల ఉద్యోగాలు.. 32 ఏళ్లవారు కూడా అర్హులే..!

SSC CGL 2022: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగం చేయాలనే కోరిక ఉన్న నిరుద్యోగులకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఒక గొప్ప అవకాశాన్ని అందించింది.

Update: 2022-10-04 15:30 GMT

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో సహా 20 వేల ఉద్యోగాలు.. 32 ఏళ్లవారు కూడా అర్హులే..!

SSC CGL 2022: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగం చేయాలనే కోరిక ఉన్న నిరుద్యోగులకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఒక గొప్ప అవకాశాన్ని అందించింది. దాదాపు ఇరవై వేల పోస్టులను ప్రకటించింది. ఈ పోస్టులు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2022 ద్వారా భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్తులు అక్టోబర్ 08లోపు అప్లై చేసుకోవాలని సూచించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం కమిషన్ అభ్యర్థులను టైర్ 1, టైర్ 2 ఆధారంగా ఎంపిక చేస్తుంది. టైర్ 3, టైర్ 4 ఇప్పుడు టైర్ 2లో విలీనం అయ్యాయి. టైర్ 2లో మూడు పేపర్లు ఉంటాయి. SSC CGL టైర్ 2 పేపర్ 1 మూడు కొత్త మాడ్యూళ్లను కలిగి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా SSC CGL టైర్ 2 కింద కొత్త పరీక్షా విధానాన్ని తెలుసుకుంటే మంచిది.

SSC CGL పరీక్ష ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులని భర్తీ చేస్తారు. దీని కోసం అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే వయస్సు 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

SSC CGL పరీక్షకి ఎలా అప్లై చేయాలి..?

1. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inకి వెళ్లాలి.

2. తర్వాత రిజిస్టర్ చేసుకుని ఆపై హోమ్ పేజీలోని 'వర్తించు' విభాగానికి వెళ్లాలి.

3. ఇక్కడ CGL పరీక్ష 2022 అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

4. మీ ముందు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించాలి. ఓకె బటన్‌పై క్లిక్ చేయాలి.

5. తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి ఆపై పరీక్షకు నిర్ణీత రుసుమును చెల్లించాలి.

6. అభ్యర్థులు SSC CGL దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.

Tags:    

Similar News