కొంతమంది వ్యక్తులని 420 అని పిలుస్తారు.. దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసా..?
Section 420: కొంతమంది వ్యక్తులని తరచుగా 420 అని పిలవడం అందరు గమనించే ఉంటారు.
Section 420: కొంతమంది వ్యక్తులని తరచుగా 420 అని పిలవడం అందరు గమనించే ఉంటారు. అంటే వారు చెడ్డవారు లేదా మోసాలకు పాల్పడేవారని అర్థం అవుతుంది. ఈ ఒక్క పదం అతని పూర్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అసలు 420 అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది.. మోసాలు చేసేవారిని ఇలా ఎందుకు పిలుస్తారు.. దీని గురిరంచి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
420 పదం వెనుక ఒక లాజిక్ ఉంది. ఇది కేవలం సంఖ్య కాదు ఒక పూర్తి చట్టం. 420 అనేది భారతీయ శిక్షాస్మృతిలోని ఒక విభాగం. ఇతరులను మోసం చేసే లేదా మోసాలకు పాల్పడే వ్యక్తులపై ఈ సెక్షన్ విధిస్తారు. అందుకే ఎవరైనా మోసం చేసినప్పుడు వారిని 420 అని పిలవడం మొదలుపెడతారు. సెక్షన్ 420 ప్రకరాం సదరు వ్యక్తి తప్పు చేసినట్లుగా తేలితే గరిష్టంగా 7 సంవత్సరాల జైలుశిక్ష ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా చెల్లించాలి.
ఈ సెక్షన్ కింద ఎవరైనా దోషిగా తేలితే అది గుర్తించదగిన నేరం కిందకు వస్తుంది. ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా లభించదు. ఉదాహరణకి నిజాయితీగా నటించి ఒకరి ఆస్తులని తన ఆస్తిగా మార్చుకోవడం, లేదా ఎవరైనా అలా చేయడానికి సహాయం చేయడం, ఉద్యోగాల పేరుతో డబ్బులు దోచేయడం, కంపెనీలు పెట్టి డబ్బులు లూటీ చేయడం వంటివి 420 కిందకి వస్తాయి. అలాంటి వ్యక్తులపై సెక్షన్ 420 కేసులు నమోదుచేస్తారు.