జీన్స్‌, టీషర్ట్‌ వేసుకొస్తే ఇంటికే.. సంచలన నిర్ణయం తీసుకున్న అక్కడి విద్యాశాఖ..!

Jeans And T shirts Order: బిహార్‌ విద్యాశాఖ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2023-06-29 13:26 GMT

జీన్స్‌, టీషర్ట్‌ వేసుకొస్తే ఇంటికే.. సంచలన నిర్ణయం తీసుకున్న అక్కడి విద్యాశాఖ..!

Jeans And T shirts Order: బిహార్‌ విద్యాశాఖ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై విద్యాశాఖ ఉద్యోగులు ఎవ్వరైనా జీన్స్, టీ-షర్టులు ధరించి కార్యాలయానికి రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు టీషర్టులు, జీన్స్ ధరించి కార్యాలయానికి రావడంపై విద్యాశాఖ డైరెక్టర్ (పరిపాలన) గత కొన్నిరోజులుగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆఫీస్ కల్చర్‌కు విరుద్ధమైన దుస్తులు ధరించి కార్యాలయాలకి రాకూడదని పేర్కొన్నారు. ఇలాంటి దుస్తులు ధరించడం పనిచేసే సంస్కృతికి విరుద్ధమని తెలిపారు.

ఉద్యోగులందరూ ఫార్మల్ డ్రెస్‌లోనే రావాలని అన్ని విద్యాశాఖ కార్యాలయాలకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని కాదని ఎవరైనా జీన్స్, టీ-షర్టులు ధరించి ఉద్యోగానికి వస్తే వారు తిరిగి ఇంటికే వెళ్లాల్సి ఉంటుంది. ఏప్రిల్‌లో సరన్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ కార్యాలయాలలో జీన్స్ టీ-షర్టులు ధరించడాన్ని నిషేధించారు. అధికారిక దుస్తులు ధరించాలని, ఐడెంటీ కార్డులని తీసుకురావాలని ఆదేశాలు జారీచేశారు.

2019లో బీహార్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు జీన్స్, టీ-షర్టులు ధరించడాన్ని నిషేధించింది. కార్యాలయ గౌరవాన్ని కాపాడడమే దీని ఉద్దేశ్యమని పేర్కొంది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు సాధారణ, సౌకర్యవంతమైన, లేత రంగు దుస్తులు ధరించాలని ప్రభుత్వం కోరింది. ఇదే నిర్ణయాన్ని ప్రస్తుతం విద్యాశాఖ అమలు చేయడానికి సిద్దమైంది. ఉద్యోగస్థులు హుందాగా ఉండటానికి ఫార్మల్‌ డ్రెస్‌ దోహదం చేస్తుందని ఉన్నత అధికారుల అభిప్రాయం.

Tags:    

Similar News