పది, ఐటీఐ చదివినవారికి శుభవార్త.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం..!

RCF Apprentice 2023: ఐటీఐ,పది చదివిన నిరుద్యోగులకి ఈ వార్త శుభవార్తని చెప్పాలి.

Update: 2023-02-11 12:30 GMT

పది, ఐటీఐ చదివినవారికి శుభవార్త.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం..!

RCF Apprentice 2023: ఐటీఐ,పది చదివిన నిరుద్యోగులకి ఈ వార్త శుభవార్తని చెప్పాలి. రైల్ కోచ్ ఫ్యాక్టరీ వివిధ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rcf.indianrailways.gov.inలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను చూడవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 550 ఖాళీలను భర్తీ చేస్తారు. అప్లికేషన్ లింక్ 24 గంటలు మాత్రమే యాక్టివేట్ అవుతుందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు మార్చి 4, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యా అర్హత,వయో పరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ డిగ్రీతోపాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థుల వయసు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారుడి వయస్సు 31 మార్చి 2023 నుంచి లెక్కిస్తారు. గరిష్ట వయోపరిమితిలో OBC కేటగిరీకి 3 సంవత్సరాలు, SC, ST వర్గాలకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. వికలాంగ వర్గానికి చెందిన అభ్యర్థులకు గరిష్ట వయస్సులో 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

అప్రెంటీస్‌ పోస్టులకు మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విద్యార్హత ఆధారంగా మెరిట్ తయారు చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తుదారుడు రూ.100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST వర్గాలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ rcf.indianrailways.gov.inకి వెళ్లాలి. .

2. హోమ్ పేజీలో దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయాలి.

3. మెయిల్ ఐడి, ఫోన్ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా పేరు నమోదు చేసుకోవాలి.

4. విద్యా పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

5. దరఖాస్తు రుసుము చెల్లించి ఓకె చేయాలి.

6. తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులని పిలుస్తారు.

7. అభ్యర్థులు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం చేసిన దరఖాస్తు మాత్రమే చెల్లుబాటు అవుతాయని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News