NEET 2022 Results: నీట్ ఫలితాలు విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
NEET 2022 Results: అత్యధిక మార్కులతో అత్యుత్తమ ర్యాంకులు
NEET 2022 Results: దేశ వ్యాప్తంగా వైద్యకళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ 2022 ఫలితాలు ప్రకటించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పరీక్షలో బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరచారు. 715 మార్కులు సాధించిన నలుగురు తొలి నాలుగు ర్యాంకుల్ని కైవసం చేసుకున్నారు. నలుగురికీ ఒకే రకమైన మార్కులు రావడంతో వయసును బట్టి ర్యాంకు కేటాయించారు.
రాజస్థాన్‌కు చెందిన తనిష్క తొలి ర్యాంకును కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలించింది. దిల్లీకి చెందిన వత్స ఆశీష్ బాత్రాకు రెండో ర్యాంకు లభించింది. కర్ణాటకకు చెందిన హరికేశ్ నాగభూషణ్ మూడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన రుచ పావషి నాలుగో ర్యాంకు కైవసం చేసుకుంది. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు 711 మార్కులతో ఐదో ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రకు చెందిన రిషి వినయ బాల్సే 710 మార్కులతో ఆరో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. పంజాబ్‌కు చెందిన అర్పిత్ నారంగ్710 మార్కులతో ఏడో స్థానంలో నిలిచాడు. కర్ణాటకకు చెందిన ఎస్ఆర్ క్రిష్ణ 710 మార్కులతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. గుజరాత్‌కు చెందిన జీల్ విపుల్ దాస్ 710 మార్కులతో తొమ్మిదో ర్యాంకు అందుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన హాజిక్ పర్వీజ్ 710 మార్కులతో పదో ర్యాంకు అందుకున్నాడు.
దేశవ్యాప్తంగా 18 లక్షల మంది నీట్ పరీక్షరాశారు. 9 లక్షల 93వేల 69 మంది ఉత్తీర్ణులయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 91 వేల 927 మెడికల్ సీట్లుండగా 48 వేల 012 సీట్లు ప్రభుత్వ కోటాకింద, 43 వేూల915 సీట్లు ప్రైవేటు యాజమాన్యంకోటాకింద ఉన్నాయి. ఒక్కో మెడికల్ సీటుకోసం వందమందికి పైగా పోటీ పడుతున్నారని తెలుస్తోంది.
ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో అత్యధికులు ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాకట ప్రాంతానికి చెందిన వారున్నారన సమాచారం. జులై 17న దేశవ్యాప్తంగా 497 నగరాల్లో 3570 కేంద్రాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. తెలంగాణలో 5వేల 40 సీట్లుండగా నీట్‌లో 35వేల148 మంది అర్హత సాధించారు.