పది, ఐటీఐ చేసినవారికి బంపర్ ఆఫర్.. రక్షణ మంత్రిత్వ శాఖలో 1793 పోస్టులు..!
పది, ఐటీఐ చేసినవారికి బంపర్ ఆఫర్.. రక్షణ మంత్రిత్వ శాఖలో 1793 పోస్టులు..!
Ministry of Defense Recruitment 2023: మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌లో వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ట్రేడ్స్‌మన్, ఫైర్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ కింద 1,793 పోస్టులను భర్తీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aocrecuritment.gov.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకంటే మంచిది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియడానికి చివరి తేదీ 26 ఫిబ్రవరి 2023గా నిర్ణయించారు. ఇందులో 1,249 ట్రేడ్స్‌మెన్, 544 ఫైర్‌మెన్‌ల పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీంతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండటం తప్పనిసరి. మరోవైపు ఫైర్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తుంది. దీని ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ జరుగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ కింద ట్రేడ్స్‌మన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతం చెల్లిస్తారు. అలాగే ఫైర్‌మెన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం కింద రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.