ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది.. పోస్టులని ఎలా కేటాయిస్తారో తెలుసుకోండి..

IAS IPS Selection Process: యూనియన్ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఫలితాలు రాగానే అభ్యర్థులలో కొందరు IASకి, మరికొందరు IPSకి, మరికొంతమంది IFSకి ఎంపికవుతారు.

Update: 2022-10-21 10:55 GMT

ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది.. పోస్టులని ఎలా కేటాయిస్తారో తెలుసుకోండి..

IAS IPS Selection Process: యూనియన్ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఫలితాలు రాగానే అభ్యర్థులలో కొందరు IASకి, మరికొందరు IPSకి, మరికొంతమంది IFSకి ఎంపికవుతారు. అయితే వారు ఆయా పోస్టులకి ఎలా ఎంపికవుతారనేది కొంచెం గందరగోళంగా ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. అయినప్పటికి ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఎంపిక ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఏ అభ్యర్థికి ఏ జాబ్‌ కేటాయిస్తారనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి అభ్యర్థులను ముందుగా వారి ప్రాధాన్యత గురించి అడుగుతారు. దాని ఆధారంగానే పోస్టులని విభజిస్తారు. సాధారణంగా ర్యాంకింగ్ ఆధారంగా పోస్టుల పంపిణీ ఉంటుంది. ఇందులో టాప్ ర్యాంక్ అభ్యర్థులు IAS, IFS వంటి సేవలను పొందుతారు. కానీ అగ్రశ్రేణి అభ్యర్థులందరూ ఐఏఎస్‌లు అవుతారని కాదు. ఒక అభ్యర్థికి మంచి ర్యాంక్ వచ్చి ఐపీఎస్‌కు ప్రాధాన్యత ఉంటే వారికి ఐపీఎస్ ఇస్తారు. అంటే మీ ప్రాధాన్యత, ర్యాంక్ ఆధారంగా జాబ్‌ కేటాయిస్తారు.

ఇది కాకుండా ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కూడా పోస్టుల పంపిణీ జరుగుతుంది. దీని కారణంగా కొన్నిసార్లు తక్కువ ర్యాంక్ అభ్యర్థులు కూడా IFS పొందుతారు. ప్రతిసారీ సివిల్‌ సర్వీస్‌ పోస్టుల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర పోస్టుల సంఖ్య ముందుగానే తెలిసిపోతుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులు IAS లేదా IPS మాత్రమే అవుతారు అనేది నిజం కాదు. ఇందులో 24 సర్వీసుల్లో అభ్యర్థులను నియమిస్తారు.

ఈ సర్వీసెస్‌లో ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ అనే రెండు వర్గాలు ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్‌లో ఐఏఎస్, ఐపీఎస్ తదితర పోస్టులుంటాయి. మరోవైపు ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంటే IFS, IIS, IRPS, ICAC ఉంటాయి. ఇవి సెంట్రల్ సర్వీస్‌లో వస్తాయి. అదే సమయంలో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్ కూడా ఇందులోకే వస్తాయి.

Tags:    

Similar News