Highest Paying Jobs: దేశంలో అత్యధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..!
Highest Paying Jobs: చదువుకునే ప్రతి ఒక్కరికి అత్యధిక వేతనం పొందే ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది.
Highest Paying Jobs: చదువుకునే ప్రతి ఒక్కరికి అత్యధిక వేతనం పొందే ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది. కానీ ఇది అందరికి సాధ్యం కాదు. ఎంతో శ్రమిస్తే తప్ప ఈ ఉద్యోగం సాధించలేం. ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే మంచి హోదా, ఇతర సౌకర్యాలతో పాటు అందమైన జీతం పొందుతారు. అంతేకాకుండా కుటుంబ జీవితాన్ని నచ్చినట్లు సెట్ చేసుకోవచ్చు. ఈ రోజు భారతదేశంలో అత్యధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకుందాం.
ఐఏఎస్, ఐపీఎస్
ఈ రెండు పోస్టులు దేశ ప్రగతికి సంబంధించినవి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ కమ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తారు. అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ జిల్లా సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తారు. ఈ పోస్టులకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ ద్వారా ఎంపిక కావాల్సి ఉంటుంది. ఏడవ వేతన సంఘం కింద ఐఏఎస్, ఐపీఎస్‌లకు జీతం లభిస్తుంది. ఇందులో ప్రారంభ వేతనం నెలకు రూ. 56,100 ఉంటుంది. కొన్ని నెలల తర్వాత 1 లక్షకు పైగా చేరుకుంటుంది. ఇది కాకుండా ప్రయాణం, ఆరోగ్యం, వసతి సహా అనేక రకాల అలవెన్సులు ఉంటాయి.
ఎన్‌డీఏ, డిఫెన్స్ సర్వీసెస్
భారత నేవీ, వైమానిక, సైన్యంలో ఉద్యోగాలు సవాలుతో కూడుకున్నవి. వీటిలో లెఫ్టినెంట్ పోస్టులకు యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఎన్డీఏ, సీడీఎస్, ఏఎఫ్‌సీఏటీ పరీక్షలు నిర్వహిస్తారు. లెఫ్టినెంట్ ప్రారంభ వేతనం రూ.68,000. పదోన్నతి పొందిన తర్వాత మేజర్ అయినప్పుడు రూ. 1 లక్ష జీతం చెల్లిస్తారు. ఇది కాకుండా అనేక ఇతర అలవెన్సులు పొందుతారు.
ఇస్రో, డీఆర్‌డీవో సైంటిస్ట్
ఇంజనీరింగ్ విద్యార్థులు ఇస్రో, DRDOలలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కావచ్చు. ఈ సంస్థల్లో పనిచేయడం వల్ల సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. సమాచారం ప్రకారం ప్రారంభ జీతం 60 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇది 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువకి పెరుగుతుంది.
ఆర్బీఐ గ్రేడ్ బి ఉద్యోగాలు
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి ఉంటే కెరీర్‌ను ప్రారంభించడానికి ఆర్బీఐ గ్రేడ్ బి ఉత్తమ ఎంపిక. ఇందుకోసం ఆర్‌బీఐ ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తోంది. ఎంపికైన అభ్యర్థుల పిల్లల చదువుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఆర్బీఐ గ్రేడ్ బి పోస్టుకు ప్రారంభ వేతనం నెలకు రూ.67,000 వరకు ఉంటుంది. అలవెన్సులు కూడా లభిస్తాయి.