ఐటీబీపీలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. వారు మాత్రమే అర్హులు..!
ఐటీబీపీలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. వారు మాత్రమే అర్హులు..!
ITBP SI Recruitment 2022: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) కానిస్టేబుల్ (పయనీర్), సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) పోస్టులకి అప్లై చేయడానికి చివరి తేదీని పొడిగించింది. ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకి చివరి తేదీ 01 అక్టోబర్ 2022 కాగా ఐటీబీపీ ఎస్సై పోస్టులకు 29 సెప్టెంబర్ 2022గా నిర్ణయించారు. అభ్యర్థులు recruitment.itbpolice.nic.in లో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కి సంబంధించి మరిన్ని వివరాలని తెలుసుకుందాం.
ఐటీబీపీ కానిస్టేబుల్ (పయనీర్) గ్రూప్ C పోస్టులు 103 ఉన్నాయి. ఇందులో కార్పెంటర్ 56, మేసన్ 31, ప్లంబర్ 21 పోస్టులు ఉన్నాయి. మేసన్ లేదా కార్పెంటర్ లేదా ప్లంబర్ ట్రేడ్‌లో గుర్తింపు పొందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ నుంచి 1 సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు, అలాగే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఐటీబీపీ స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే జనరల్ నర్సింగ్, మిడ్-వైఫరీ పాస్ అయి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుంగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు కోసం అభ్యర్థులు మూడు దశల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. మొదటి దశలో దేహదారుఢ్య పరీక్ష, రెండో దశలో 100 మార్కులకు రాత పరీక్ష, మూడో దశలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి..
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.inకి వెళ్లాలి.
2. తర్వాత New Registrationపై క్లిక్ చేసి పేరు నమోదు చేసుకోవాలి.
3. తర్వాత లాగిన్ అయి దరఖాస్తు ఫారం నింపాలి.
4. తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా ప్రక్రియను పూర్తి చేయాలి.
5. చివరిగా ఫారమ్‌ను సమర్పించి హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోవాలి.