నిరుద్యోగులకి అలర్ట్.. కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలకి అప్లై చేశారా.. చివరితేదీ వచ్చేసింది..!
Indian Coast Guard Jobs 2023: దేశంలోని సముద్రతీర ప్రాంతాలను పర్యవేక్షించే బాధ్యత ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తుంది.
Indian Coast Guard Jobs 2023: దేశంలోని సముద్రతీర ప్రాంతాలను పర్యవేక్షించే బాధ్యత ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తుంది. ఇందులో ఉద్యోగాలు పొందిన యువతకి సముద్రపు అలలపై పయనించే అవకాశం లభిస్తుంది. అయితే కోస్ట్ గార్డ్‌లో చేరాలనుకునే యువకుల ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాదు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా వచ్చేసింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ 255 నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమైంది. చివరి తేది ఫిబ్రవరి 16 మాత్రమే. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్ joinindiancoastguard.cdac.inని సందర్శించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. నావిక్ జనరల్ డ్యూటీ పోస్టుల సంఖ్య 225 కాగా, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్‌లో 30 పోస్టులు భర్తీ చేస్తారు.
అర్హత ప్రమాణాలు ఏమిటి?
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో రిక్రూట్ అయ్యే అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
నావిక్ (జనరల్ డ్యూటీ): అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ ఏమిటి?
స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో పనితీరు ఆధారంగా ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. ఈ దశల్లో రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు INS చిల్కాలో శిక్షణ ఉంటుంది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు.