IGNOU: బీఏ అప్లైయిడ్‌ సంస్కృత కోర్సుని ప్రారంభించిన ఇగ్నో.. ఎవరు అర్హులంటే..?

IGNOU: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ బీఏ అప్లైడ్ సంస్కృత కోర్సును ప్రారంభించింది.

Update: 2023-03-07 11:04 GMT

IGNOU: బీఏ అప్లైయిడ్‌ సంస్కృత కోర్సుని ప్రారంభించిన ఇగ్నో.. ఎవరు అర్హులంటే..?

IGNOU: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ బీఏ అప్లైడ్ సంస్కృత కోర్సును ప్రారంభించింది. ఇటీవల ప్రారంభించిన ఈ కొత్త సంస్కృత కోర్సులో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం.

ఇగ్నో వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు బీఏ అప్లైడ్ సంస్కృత కోర్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా సంస్కృత భాషని అభివృద్ధి చేయడం, విద్యార్థులకు సంస్కృత భాషలో ప్రావీణ్యం కలిగించడం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఈ సంస్కృత కోర్సు మాధ్యమం హిందీలో ఉంటుంది. దీని వ్యవధి 3 సంవత్సరాలు. 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ కోర్సు చేయడానికి అర్హులు అవుతారు.

కోర్సు ఫీజు ఎంత..?

బీఏ అప్లైడ్ సంస్కృత కోర్సుకు సంవత్సరానికి రూ.4,500 ఫీజు. ఇది కాకుండా ఈ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రిజిస్ట్రేషన్/డెవలప్‌మెంట్ ఫీజు చెల్లించాలి.

ఎలా అప్లై చేయాలి..?

1. ముందుగా ignou.ac.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న తాజా అడ్మిషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఒక కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోవచ్చు.

4. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. నిర్ణీత రుసుమును చెల్లించండి.

5. ఆ తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయండి.

6. తర్వాత దానిని డౌన్‌లోడ్ చేయండి.

7. తదుపరి అవసరాల కోసం హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోండి.

Tags:    

Similar News