IGNOU Recruitment 2023: ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ. 60,000 వరకు జీతం..!

IGNOU Recruitment 2023: ఇంటర్‌ చదివిన నిరుద్యోగులకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి.

Update: 2023-03-25 12:03 GMT

IGNOU Recruitment 2023: ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ. 60,000 వరకు జీతం..!

IGNOU Recruitment 2023: ఇంటర్‌ చదివిన నిరుద్యోగులకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (నాన్‌ టీచింగ్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో టైపింగ్ వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 22, 2023వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు రూ.600 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. సెలక్ట్ అయిన క్యాండెట్లకి నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతం చెల్లిస్తారు.

మొత్తం ఖాళీలు 200 పోస్టులు

రిజర్వ్ కేటగిరీ: యూఆర్- 83, ఎస్సీ- 29, ఎస్టీ- 12, ఓబీసీ- 55

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 21.04.2023 నుంచి 22.04.2023 వరకు.

రాత పరీక్ష విధానం

150 మార్కులకుగానూ 2 గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌, మ్యాథమెటిక్స్‌ ఎబిలిటీ, హిందీ/ఇంగ్లిస్‌ కాంప్రహెన్షన్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల్లో పరీక్ష ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Tags:    

Similar News