High Paying Jobs: ఈ దేశాలలో జాబ్‌ చేస్తే అధిక వేతనాలు.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన..!

High Paying Jobs: ఈ రోజుల్లో యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు.

Update: 2023-06-16 16:00 GMT

High Paying Jobs: ఈ దేశాలలో జాబ్‌ చేస్తే అధిక వేతనాలు.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన..!

High Paying Jobs: ఈ రోజుల్లో యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం విదేశాలకి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీ వైపు వెళితే మరికొంతమంది హోటల్‌ రంగంలో, ఇతర కంపెనీలలో కార్మికులుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అయితే అన్ని దేశాలలో ఎక్కువ సంపాదన ఉండదు. ఉద్యోగులకి అత్యధిక వేతనాలు చెల్లించే కొన్ని ప్రత్యేక దేశాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

లక్సెంబర్గ్

లక్సెంబర్గ్ పశ్చిమ ఐరోపాలో ఉన్న ఒక చిన్న దేశం. ఇది కార్మికులకు అధిక జీతాలు చెల్లించడంలో ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో ఉద్యోగులకు సగటు వార్షిక వేతనం 65 వేల డాలర్లు అంటే దాదాపు 48 లక్షల రూపాయలు.

నెదర్లాండ్స్

యూరోప్ దేశం నెదర్లాండ్స్ కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సిటీగా పిలువబడే ఆమ్‌స్టర్‌డామ్ పేరుని తప్పక వినే ఉంటారు. ఇక్కడ సగటు వార్షిక వేతనం 54 వేల డాలర్లు అంటే దాదాపు 40 లక్షల రూపాయలు.

ఆస్ట్రేలియా

అందమైన సముద్ర తీరాలకి ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియా ఆర్థికంగా సంపన్నమైన దేశం. భారతీయ యువత మొదటి ఎంపికలో ఈ దేశం ఉంటుంది. ఇక్కడ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 53 వేల డాలర్లు అంటే దాదాపు 39 లక్షల రూపాయలు.

నార్వే

నార్వే సహజ సౌందర్యం దృశ్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేశం తన ఉద్యోగులకు అత్యధిక జీతం ఇవ్వడంలో ముందువరుసలో ఉంది. ఇక్కడ సగటు వార్షిక వేతనం 51 వేల డాలర్లు అంటే దాదాపు 37 లక్షల రూపాయలు.

ఆస్ట్రియా

ఆస్ట్రియా మధ్య ఐరోపాలోని ఒక చిన్న దేశం. ఇది జీవన నాణ్యత పరంగా గొప్ప దేశంగా చెప్పవచ్చు. ఇక్కడి ఉద్యోగుల సగటు జీతం చాలా ఎక్కువ. ఈ దేశంలో ప్రజలు సంవత్సరానికి దాదాపు 50 వేల డాలర్లు అంటే దాదాపు 36 లక్షల రూపాయల జీతం పొందుతారు.

బెల్జియం

బెల్జియం ఐరోపాలోని ఒక దేశం. ఇక్కడ ఉద్యోగుల జీతం చాలా ఎక్కువగా ఉంటుంది. సమాచారం ప్రకారం ఇక్కడి ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 52 వేల డాలర్లు అంటే దాదాపు 38 లక్షల రూపాయలు.

Tags:    

Similar News