ICMR NIN Recruitment 2024: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు.. అర్హత, జీతం వివరాలు తెలుసుకోండి..!
ICMR NIN Recruitment 2024: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR NIN) హైదరాబాద్ నుంచి ఓ షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ICMR NIN Recruitment 2024: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR NIN) హైదరాబాద్ నుంచి ఓ షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నీషియన్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి పోస్టుల భర్తీకి ఐసీఎంఆర్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అద్భుతమైన జీతం, అలవెన్సు, సౌకర్యాలు లభిస్తాయి. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెసె ఇంకా ప్రారంభం కాలేదు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ రోజు తెలుసుకుందాం.
ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్ భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆరోగ్య పరిశోధన విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఇన్‌స్టిట్యూట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు
టెక్నీషియన్ అసిస్టెంట్: 4 పోస్టులు
టెక్నీషియన్-1: 9 పోస్టులు
ల్యాబ్ అటెండెంట్-1: 21 పోస్టులు
లోయర్ డివిజన్ క్లర్క్: 6 పోస్టులు
లైబ్రరీ క్లర్క్: 1 పోస్ట్
అప్పర్ డివిజన్ క్లర్క్: 7 పోస్టులు
లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 1 పోస్ట్
అసిస్టెంట్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (డిప్యూటేషన్‌పై ): 1 పోస్ట్
జీతం వివరాలు
టెక్నీషియన్ అసిస్టెంట్ లెవల్ 6 - రూ. 35,400 - రూ. 1,12,400 వరకు
టెక్నీషియన్-1 లెవల్ 2 - రూ. 19,900 - రూ. 63,200
ల్యాబ్ అటెండెంట్-1 లెవల్ 1 - రూ. 18,000 - రూ. 56,900