నిరుద్యోగులకి శుభవార్త.. ఐబీపీఎస్ నుంచి 710 స్పెషలిస్టు ఆఫీసర్‌ ఉద్యోగాలు..

నిరుద్యోగులకి శుభవార్త.. ఐబీపీఎస్ నుంచి 710 స్పెషలిస్టు ఆఫీసర్‌ ఉద్యోగాలు..

Update: 2022-11-03 04:32 GMT

నిరుద్యోగులకి శుభవార్త.. ఐబీపీఎస్ నుంచి 710 స్పెషలిస్టు ఆఫీసర్‌ ఉద్యోగాలు..

IBPS Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) 2023-24 ఆర్ధిక సంవత్సరానికి 710 స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ లేదా తత్సమాన డిగ్రీలో పాస్‌ అయి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్‌ 1, 2022వ తేదీ నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే నవంబర్‌ 2, 1992 నుంచి నవంబర్‌ 1, 2002ల మధ్య జన్మించిన వారు అర్హులు.

రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌, ఓబీసీ అభ్యర్ధులకు రూ.850లు ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్/మహిళా అభ్యర్ధులు రూ.175లు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఖాళీల వివరాలు..

1.ఐటీ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టులు: 44

2.అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టులు: 516

3.రాజభాష అధికారి (స్కేల్‌-1) పోస్టులు: 25

4.లా ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టులు: 10

5.హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టులు: 15

5.మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టులు: 100

రాత పరీక్ష విధానం

ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 150 ప్రశ్నలకు 2 గంటల సమయంలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌లో 50 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మెయిన్‌ పరీక్ష 60 ప్రశ్నలకు 60 మార్కులకు 45 నిముషాల్లో పరీక్ష జరుగుతుంది. మెయిన పరీక్షలో షార్ట్‌లిస్టింగ్‌ చేసిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అనంతరం అందులో ప్రతిభ చూపిన వారిని ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు.

Tags:    

Similar News