Hyderabad Metro Jobs 2023: నిరుద్యోగులకి అలర్ట్.. హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలు..!
Hyderabad Metro Jobs 2023: మెట్రోలో పనిచేయాలనుకునే వ్యక్తులకి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.
Hyderabad Metro Jobs 2023: మెట్రోలో పనిచేయాలనుకునే వ్యక్తులకి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణలో చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీంతో పాటు ఇప్పుడు హైదరాబాద్ మెట్రో నుంచి మరొక నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఆసక్తి గల నిరుద్యోగులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే పోస్టుల సంఖ్య, అర్హతలతో పాటు పలు వివరాల గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్ మెట్రో ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 12 ఉద్యోగాలని భర్తీ చేయనుంది. అందులో ఏఎంఎస్ ఆఫీసర్- 1, సిగ్నలింగ్ టీమ్- 2, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్- 6, ట్రాక్స్ టీమ్ లీడర్- 2, ఐటీ ఆఫీసర్- 1 పోస్టులున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా https://www.ltmetro.com/ వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేసి, కరెంట్ ఆపర్చ్యునిటీస్ పై క్లిక్ చేయాలి. అర్హతలు, వివరాలు నమోదు చేసి KeolisHyd.Jobs@keolishyderabad.com మెయిల్ ఐడీకి పంపించాలి.
పోస్టుల వివరాలు అర్హతలు
1. ఏఎంఎస్ ఆఫీసర్ పోస్టుకు ఇంజనీరింగ్, అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
2. సిగ్నలింగ్ టీమ్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
3. రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ పోస్టుకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
4. ట్రాక్స్ టీమ్ లీడర్ పోస్టుకు సివిల్, మెకానికల్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉండాలి.
5. ఐటీ ఆఫీసర్ పోస్టుకు బీటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సీ, 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలి.