GATE 2023: గేట్‌ పరీక్ష రిజిస్ట్రేషన్ చివరి తేది పొడగింపు..

GATE 2023: గేట్‌ పరీక్ష రిజిస్ట్రేషన్ చివరి తేది పొడగింపు..

Update: 2022-10-02 14:30 GMT

GATE 2023: గేట్‌ పరీక్ష రిజిస్ట్రేషన్ చివరి తేది పొడగింపు..

GATE 2023: 2023లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GATE)కోసం ఇప్పటి వరకు అప్లై చేసుకోని అభ్యర్థులకు ఇది మరొక అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ గేట్ 2023 కోసం దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీని పొడిగించింది. ఇప్పుడు అభ్యర్థులు 4 అక్టోబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం లభించింది.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gate.iitk.ac.inని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే GATE 2023 కోసం ఆలస్య రుసుముతో అభ్యర్థులు 7 అక్టోబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ 500 ఆలస్య రుసుముగా చెల్లించాలి. GATE పరీక్ష 2023కి సంబంధించి ఫిబ్రవరి 2023లో 4, 5, 11, 12 తేదీలలో నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డ్‌లు జనవరి 3, 2023న జారీ అవుతాయి. పరీక్ష 29 పేపర్లలో నిర్వహిస్తారు. SC, ST, మహిళలు, PWD కేటగిరీ అభ్యర్థులు రుసుముగా రూ.850 చెల్లించాలి. విదేశీ పౌరులతో సహా ఇతర అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1700 ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. ముందుగా gate.iitk.ac.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. తర్వాత 'గేట్ 2023 రిజిస్ట్రేషన్'పై క్లిక్ చేయాలి.

3. లాగిన్ వివరాలను నమోదు చేసి సమర్పించాలి.

4. దరఖాస్తు ఫారమ్ నింపడం ద్వారా రుసుము చెల్లించాలి.

5. పూర్తయిన తర్వాత సమర్పించుపై క్లిక్ చేయాలి.

6. నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేయాలి. భవిష్యత్ సూచన కోసం హార్డ్ కాపీని తీసుకోవాలి.

Tags:    

Similar News