Reading Skills: పిల్లల్లో చదివే అలవాటుని పెంచండి.. ఇందుకోసం ఏం చేస్తారంటే..?

Reading Skills: నేటి రోజుల్లో పిల్లలకి పుస్తకాలు చదవడమంటే అస్సలు ఇష్టం ఉండటం లేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.

Update: 2023-07-26 07:40 GMT

Reading Skills: పిల్లల్లో చదివే అలవాటుని పెంచండి.. ఇందుకోసం ఏం చేస్తారంటే..?

Reading Skills: నేటి రోజుల్లో పిల్లలకి పుస్తకాలు చదవడమంటే అస్సలు ఇష్టం ఉండటం లేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లలు పుస్తకాలకి దూరమవుతున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ పుస్తక పఠనం వల్ల లభించే నాలెడ్జ్‌ రాదు. అందుకే పిల్లల్లో చదివే అలవాటుని పెంపొందించాలి. ఇందుకోసం తల్లిదండ్రులు కొన్ని చిట్కాలని పాటించాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఆసక్తికరమైన పుస్తకాలు

పిల్లలు పుస్తకాలు చదవడానికి వాటి అభిరుచి, ఆసక్తిని తెలుసుకొని అలాంటివే తీసుకురావాలి. తరువాత వాటిని చదివేలా ప్రోత్సహించాలి. ఒక్కసారి ఈ పద్దతి అలవాటైందంటే పిల్లలు వద్దన్నా పుస్తకాలు చదువుతూ కూర్చుంటారు. పిల్లలు ఈ పుస్తకాలు చదివిన తర్వాత అందులో నుంచి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాటిపై మరింత ఆసక్తి పెరుగుతుంది.

చిన్న చిన్న గోల్స్

చదవడం అనేది పిల్లలకి ఎప్పుడు భారం కాకూడదు. చదివిన కొద్ది వారికి ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలి. ఇందుకోసం చిన్న చిన్న పుస్తకాలు తీసుకురావాలి. వాటిని పూర్తి చేశాక అభినందించాలి. వీలైతే చిన్న చిన్న బహుమతులు అందించాలి. దీనివల్ల మరిన్ని పుస్తకాలు చదవాలనే కోరిక బలపడుతుంది. తక్కువ సమయం చదివినా పర్వాలేదు చదివినదాన్ని ఆస్వాదించడం అలవాటు చేయండి. అప్పుడు వారు పుస్తకాల పురుగులా మారిపోతారు.

పుస్తక సమీక్ష

పిల్లలు చదివిన పుస్తకం గురించి ప్రతిరోజు మాట్లాడండి. చదివిన టాఫిక్‌పై ప్రశ్నలు అడగండి. వారు పుస్తకాన్ని ఎలా ఇష్టపడుతున్నారు తెలుసుకోండి. వీలైతే మీరు కూడా వారితో కూర్చొని చదవండి. పిల్లలు వినడం కంటే మిమ్మల్ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు. దీని కారణంగా వారి పదజాలం కూడా మెరుగుపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. పఠన వేగం కోర్సు అధ్యయనాల సమయంలో సహాయపడుతుంది. అదేవిధంగా టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రమేయాన్ని తగ్గిస్తుంది.

Tags:    

Similar News