Railway Reservations:ఇప్పుడు రైల్వేలో కూడా వారికి రిజర్వేషన్స్‌.. ఇంకా వయసు సడలింపు..!

Railway Reservations: ఇప్పుడు రైల్వే రిక్రూట్‌మెంట్లలో కూడా మాజీ అగ్నివీర్లకు రిజర్వేషన్ ప్రకటించారు.

Update: 2023-05-16 14:30 GMT

Railway Reservations:ఇప్పుడు రైల్వేలో కూడా వారికి రిజర్వేషన్స్‌.. ఇంకా వయసు సడలింపు..!

Railway Reservations: ఇప్పుడు రైల్వే రిక్రూట్‌మెంట్లలో కూడా మాజీ అగ్నివీర్లకు రిజర్వేషన్ ప్రకటించారు. దీంతో పాటు పీఈటీ పరీక్షలో కూడా మినహాయింపు లభిస్తుంది. ఇందుకోసం రైల్వే తన రిక్రూట్‌మెంట్‌లో 15 శాతం పోస్టులను అగ్నివీర్‌లకు రిజర్వ్ చేస్తుంది. ఈ మేరకు రైల్వేశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో BSF రిక్రూట్‌మెంట్‌లో మాజీ అగ్నివీరులకు 10 శాతం పోస్టులను రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

పారామిలిటరీ బలగాలలో కూడా మాజీ అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ కోసం ప్రత్యేక రిజర్వేషన్‌ ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించారు. ఇప్పుడు రైల్వేలోని లెవల్-1 క్లాస్-IV పోస్టులలో మాజీ అగ్నివీరులకు 10 శాతం, లెవల్-2 పోస్టులలో 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు. అంతేకాదు వయసు సడలింపు కూడా ఇచ్చారు. నివేదిక ప్రకారం రైల్వేలు జారీ చేసిన రిక్రూట్‌మెంట్లలో మొదటి బ్యాచ్ మాజీ అగ్నివీర్‌లకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. తరువాత మాజీ అగ్నివీర్‌ల బ్యాచ్‌కు వయోపరిమితిలో 3 సంవత్సరాల సడలింపు ఇస్తారు.

రైల్వేస్ విడుదల చేసిన లెవెల్-1, లెవెల్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే మాజీ అగ్నివీరులు పీఈటీ పరీక్షకు హాజరుకానవసరం లేదు. కేవలం రాత పరీక్షకు హాజరైతే సరిపోతుంది. BSF రిక్రూట్‌మెంట్‌లో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్‌తో పాటు వయసు సడలింపు కూడా ఉంటుంది. భారత సైన్యంలోని మూడు విభాగాల్లో 4 సంవత్సరాల పాటు యువతను రిక్రూట్ చేయడానికి గత సంవత్సరం అగ్నివీర్ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద అగ్నివీర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.

Tags:    

Similar News