Most Educated Village: ఆసియాలోనే అత్యధిక విద్యావంతులున్న గ్రామం.. లిమ్కా బుక్‌లో చోటు..!

Most Educated Village: ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.

Update: 2023-07-18 14:30 GMT

Most Educated Village: ఆసియాలోనే అత్యధిక విద్యావంతులున్న గ్రామం.. లిమ్కా బుక్‌లో చోటు..!

Most Educated Village: ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కట్టు, బొట్టు, సంస్కృతి పరంగా ఎల్లప్పుడు ప్రత్యేకతను చాటుకుంటుంది. విదేశీయులు కూడా ఈ దేశ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే విద్య విషయంలో కూడా దేశం ముందంజలో ఉంది. ఇందుకు నిదర్శనమే ఈ గ్రామం. ఇది ఆసియాలోనే అత్యధిక విద్యావంతులు ఉన్న గ్రామంగా లిమ్కాబుక్‌లో చోటు సంపాదించింది. ఈ గ్రామం ప్రత్యేకతలేంటో ఈరోజు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని జవాన్ బ్లాక్‌లో ఉన్న ధోర్రా మాఫీ గ్రామం ఆసియాలోనే అత్యధిక విద్యావంతులు ఉన్న గ్రామంగా నిలిచింది.10 నుంచి 11 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో 90 శాతం మంది అక్షరాస్యులుంటారు. ఇదొక్కటే కాదు 2002 సంవత్సరంలో దొర్రా మాఫీ గ్రామం పేరు 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు సంపాదించింది. అప్పట్లో ఈ గ్రామం అక్షరాస్యత 75 శాతానికి పైగా ఉండడం రికార్డు సృష్టించింది. అదే సమయంలో ఈ గ్రామం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం సర్వేకు కూడా ఎంపికైంది.

ఒక పెద్ద నగరంలో ఉండే అన్ని సౌకర్యాలు ఈ గ్రామంలో ఉన్నాయి. పక్కా గృహాలు, 24 గంటల విద్యుత్, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఇక్కడి నివాసితులు వ్యవసాయం కాకుండా ఉద్యోగాలను వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఇక్కడి మొత్తం జనాభాలో 90 శాతానికి పైగా అక్షరాస్యులు ఉంటారు. గ్రామంలోని 80 శాతం మంది ప్రజలు డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు, ఐఏఎస్ అధికారులుగా ఉంటూ ఊరి పేరును మారుమోగిస్తున్నారు.

అలీఘర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు

ధోర్రా మాఫీ గ్రామం దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి ఆనుకుని ఉంటుంది. అందుకే విశ్వవిద్యాలయానికి చెందిన చాలా మంది ప్రొఫెసర్లు, వైద్యులు ఈ గ్రామంలో స్థిరపడ్డారు. ఈ గ్రామ నివాసితులు విదేశాలకు వెళ్లడం ద్వారా అక్షరాస్యత, నైపుణ్యం, విద్య స్థాయిని పెంచుకుంటున్నారు. ధోర్రా మాఫీ గ్రామంలో మగవాళ్లే కాదు మహిళలు కూడా చదువుకుని స్వయం సమృద్ధి సాధిస్తున్నారు.

Tags:    

Similar News