DDA Recruitment 2023: డిప్లొమా విద్యార్థులకి శుభవార్త.. డీడీఏలో 255 జూనియర్ ఇంజనీర్ పోస్టులు..!
DDA Recruitment 2023: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్/మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
DDA Recruitment 2023: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్/మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో 04 ఫిబ్రవరి 2023 నుంచి 18 ఫిబ్రవరి 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
DDA JE ఖాళీల వివరాలు
DDA JE జాబ్స్ 2023 కింద మొత్తం 255 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 220 సివిల్ డిసిప్లిన్, 35 ఎలక్ట్రికల్, మెకానికల్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు ఉండాలి. DDA JE పరీక్ష పేపర్ 120 మార్కులకు ఉంటుంది. సంబంధిత సబ్జెక్టుకు చెందిన 120 ప్రశ్నలతో పాటు ఆబ్జెక్టివ్ టైప్ (బహుళ ఎంపిక ప్రశ్నలు) అలాగే రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై ప్రశ్నలు ఉంటాయి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ www.dda.gov.in వెబ్‌సైట్‌లో "ఉద్యోగాలు –» డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2022" లింక్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనలు, షరతులకు అంగీకరిస్తున్న అభ్యర్థులు ఐ అగ్రీ చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి 'స్టార్ట్' బటన్‌ను నొక్కడం ద్వారా ముందుకు కొనసాగవచ్చు. అభ్యర్థి కావలసిన మొత్తం సమాచారాన్ని అంటే వ్యక్తిగత వివరాలు, సంప్రదింపు వివరాలు మొదలైనవాటిని సరిగ్గా నింపాలి.
ఫేజ్-1 రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఈ-మెయిల్ ఐడీకి మెస్సేజ్ వస్తుంది. అందులో వారి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉంటాయి. దరఖాస్తు ఫారమ్‌లో ఇతర వివరాలను నింపడానికి అభ్యర్థి లాగ్ అవుట్ చేసి మళ్లీ లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థి లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలు, అర్హత వివరాలు, డిక్లరేషన్ మొదలైన ఇతర వివరాలను అందించాల్సి ఉంటుంది.