Culture Ministry Vacancy 2024: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ చేశారా.. సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు..!
Culture Ministry Vacancy 2024: నిరుద్యోగులకు మరో అవకాశం వచ్చింది. అయితే ఇది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ చేసినవారికి మాత్రమే వర్తిస్తుంది.
Culture Ministry Vacancy 2024: నిరుద్యోగులకు మరో అవకాశం వచ్చింది. అయితే ఇది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ చేసినవారికి మాత్రమే వర్తిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ పరిధిలో లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు మంత్రిత్వ శాఖ అధికారి క వెబ్‌సైట్ indiaculture.gov.in సందర్శించి ఆఫ్‌లైన్ మోడ్‌లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు మే 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 11 లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుంచి లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ అప్లికేష న్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.దీనితో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్న యువకులు ఈ పోస్టులకు అప్లై చేసుకోలేరు. లెవెల్-6 కింద లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం అందిస్తారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ నింపి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ,సెక్రటరీ 502-C వింగ్, శాస్త్రి భవన్, న్యూఢిల్లీ-110001 అడ్రస్‌కు పంపించాలి.