CRPF Recruitment 2024: నిరుద్యోగులకు అలర్ట్.. సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..!
CRPF Recruitment 2024: పోలీస్ ఉద్యోగం చేయాలని భావించే నిరుద్యోగ యువతకు ఇది బంపర్ అవకాశం అని చెప్పాలి.
CRPF Recruitment 2024: పోలీస్ ఉద్యోగం చేయాలని భావించే నిరుద్యోగ యువతకు ఇది బంపర్ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు సులువుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందడా నికి మంచి అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ రిక్రూట్‌మెంట్ కోసం అప్లికేషన్ ప్రక్రియ కొనసాగు తోంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ crpf.gov.inని సందర్శించి ఫారమ్‌ను నింపవ చ్చు. ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి.. ఎన్ని ఖాళీలు ఉన్నాయి తదితర వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 120 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు, మాజీ సైనిక సిబ్బంది కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 14 మే 2024గా నిర్ణయించారు. అభ్యర్థు ల వయస్సు కనీసం 20 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు.
వయస్సు ఆగస్టు 1, 2024 నాటికి లెక్కిస్తారు. అయితే, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 5 ఏళ్లు, ఓబీసీ, మాజీ సైనికులకు 3 ఏళ్లు, మాజీ సైనికోద్యోగుల తొలి బ్యాచ్ అభ్యర్థు లకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. అప్లై చేయడానికి జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులు రూ. 200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి . అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇలా దరఖాస్తు చేసుకోండి
ముందుగా bpsc.bih.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
తర్వాత హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
అభ్యర్థించిన అన్ని వివరాలను నమోదు చేయండి.
తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
ఇప్పుడు నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించండి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.
ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి.