CISF Jobs 2022: టెన్త్‌, ఐటీఐ చదివిన వారికి శుభవార్త.. సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..!

CISF Jobs 2022: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం వచ్చింది.

Update: 2022-11-17 09:59 GMT

CISF Jobs 2022: టెన్త్‌, ఐటీఐ చదివిన వారికి శుభవార్త.. సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..!

CISF Jobs 2022: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం వచ్చింది. కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల కోసం బంపర్‌ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 710 పోస్టులని భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకి దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- cisfrectt.inని సందర్శించాలి.

CISF జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కానిస్టేబుల్ పోస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 21 నవంబర్ 2022 నుంచి ప్రారంభమవుతుంది. చివరితేది 12 డిసెంబర్ 2022గా నిర్ణయించారు. అయితే పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జారీ చేసిన ఈ పోస్టులకి అప్లై చేయడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా తప్పనిసరిగా ఐటీఐ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉండాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ, 23 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను ఒక్కసారి తనిఖీ చేయడం అవసరం.

ఇలా అప్లై చేసుకోండి..

1. దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ cisfrectt.inకి వెళ్లాలి.

2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో తాజా నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

3. తర్వాత CISF కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2022 లింక్‌పై క్లిక్ చేయాలి.

4. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్లై చేసే ఆప్షన్‌కి వెళ్లాలి.

5. తదుపరి పేజీలో అడిగిన వివరాలని ఎంటర్ చేయాలి.

6. రిజిస్ట్రేషన్ తర్వాత దరఖాస్తు ఫారమ్ నింపాలి.

7. అప్లికేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Tags:    

Similar News